Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవ్వ పొంగలి

Advertiesment
వంటకాలు భారతీయ పెసరపప్పు రవ్వ ఉప్పు జీడిపప్పు జీలకర్ర మిరియాలు అల్లం నెయ్యి
, గురువారం, 8 జనవరి 2009 (18:21 IST)
FileND
కావలసిన పదార్థాలు :
రవ్వ... అర కిలో
పెసరపప్పు... 75 గ్రాములు
ఉప్పు... సరిపడ
జీడిపప్పు... 20 గ్రాములు
జీలకర్ర... ఒక టీస్పూన్
మిరియాలు... సరిపడా
అల్లం... కొద్దిగా
నెయ్యి... 150 గ్రాములు

తయారీ విధానం :
పెసరపప్పును వేయించి, ఉడకబెట్టిన తరువాత నీరు తీసెయ్యాలి. రవ్వను నేతిలో వేయించాలి. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు వేయించి, అందులోనే మిరియాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక అల్లం కూడా వేయించాలి. అర లీటరు నీటిని కూడా పోయాలి.

ఆ తర్వాత ఉప్పు, వేయించిన రవ్వ కూడా దీనికి కలిపి... బాగా ఉడకనిచ్చి, ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేయాలి. నీరంతా ఇగిరి పోయి బాణలికి అంటుకోకుండా చూసుకుని దించినట్టయితే.. రవ్వ పొంగలి సిద్ధమైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu