Article Indian Cookery %e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a1%e0%b0%b2 %e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 108081300068_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మినపవడల కర్రీ

Advertiesment
వంటకాలు భారతీయ మినప్పప్పు ఉల్లిపాయలు అల్లం ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి గరంమసాలా
FileND
కావలసిన పదార్ధాలు :
మినప్పప్పు... 300 గ్రాములు
ఉల్లిపాయలు... 300 గ్రాములు
అల్లం... అంగుళం ముక్క
ఎండుమిరపకాయలు... ఐదు
పచ్చిమిర్చి... ఐదు
గరం మసాలా పొడి... అరటీస్పూన్
వెల్లుల్లి పాయ... ఒకటి
వేయించిన శెనగపప్పు... పావు కప్పు
టమోటాలు... ఆరు
ఉప్పు... సరిపడా
నూనె... సరిపడా
కొత్తిమీర... కొద్దిగా

తయారీ విధానం :
ముందుగా మినప్పప్పును మూడు గంటలపాటు నానబెట్టి బాగా కడిగి గారెల పిండిలాగ రుబ్బుకోవాలి. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు కలిపాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న గారెల మాదిరి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

అల్లం, వెల్లుల్లి, గరం మసాలాలను కలిపి ముద్ద నూరుకోవాలి. ఓ గిన్నెలో పావుకప్పు నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగాక మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. అందులో టమోటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగా సిద్ధం చేసుకున్న మినప్పప్పు గారెలను వేసి తగినంత ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

వేడివేడిగా రోటీతో గానీ దోసెలతో గానీ ఈ కూరను సర్వ్ చేయాలి. అన్నంలోకి కూడా బాగుంటుంది. గ్రేవీ చిక్కబడాలంటే టమోటాలకు బదులు పెరుగు కూడా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu