Article Indian Cookery %e0%b0%ac%e0%b1%8a%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be%e0%b0%af%e0%b0%bf %e0%b0%ae%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d 108121300048_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి మటన్

Advertiesment
వంటకాలు భారతీయ మటన్ పచ్చిబొప్పాయి పెరుగు బ్రెడ్ పొడి వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర యాలకులు లవంగాలు
కావలసిన పదార్థాలు :
మటన్... ఒక కేజీ
పచ్చి బొప్పాయి... చిన్నసైజు కాయ
పెరుగు... ఒక కప్పు
బ్రెడ్ పొడి... రెండు కప్పులు
వెల్లుల్లి... 10 రెబ్బలు
పచ్చిమిర్చి... పది
అల్లం... రెండు చిన్న ముక్కలు
కొత్తిమీర, పసుపు... తగినంత
యాలకులు... మూడు
లవంగాలు... మూడు
చెక్క... ఒకటి
బాదంపప్పులు... కొద్దిగా
ఉప్పు... తగినంత
టమోటో ముక్కలు... కాసిన్ని
కొత్తిమీర తరుగు... కొద్దిగా

తయారీ విధానం :
వండడానికి కొన్ని గంటల ముందుగానే పచ్చిబొప్పాయి ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, యాలకులు, లవంగాలు, చెక్క, బాదంపప్పులను నూరి పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా చేర్చుకోవాలి.

మటన్‌ను శుభ్రం చేసి, కావాల్సిన సైజులో ముక్కలు చేసుకుని పసుపు, పెరుగు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పైన నూరి ఉంచుకున్న మిశ్రమాన్ని మటన్‌కు పట్టించాలి. రెండు గంటలసేపు అలాగే ఉంచిన తరువాత మటన్ ముక్కలను పిడికిట్లోక తీసుకుని కోవాల్లాగా రోల్ చేసుకోవాలి.

ఈ కోవాలను బ్రెడ్ పొడిలో దొర్లించి ఓ పాత్రలో ఉంచి... 400 డిగ్రీల వేడి వద్ద మైక్రోవేవ్ ఓవెన్‌లో 35 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే బొప్పాయి మటన్ రెడీ అయినట్లే... దీన్ని టొమేటో ముక్కలు, కొత్తిమీరతరుగుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu