Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి చికెన్

Advertiesment
చెంచా
, సోమవారం, 3 మార్చి 2008 (17:53 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పచ్చి బొప్పాయి పేస్ట్ - చెంచా, చికెన్ - కిలో, పెరుగు - వంద గ్రాములు, దాల్చిన చెక్క - రెండు చిన్న ముక్కలు, జాపత్రి - చిటికెడు, ఫుడ్ కలర్ - పసుపు రంగు కలిగినది, అల్లం పేస్ట్ - చెంచా, కుంకుమ పువ్వు - చిటికెడు, వెల్లుల్లి పేస్ట్ - చెంచా, మిరియాలు - ఆరు, యాలక్కాయలు పచ్చవి, నల్లవి కలిపి - ఎనిమిది, కొత్తిమీర - కట్ట, లవంగాలు - ఐదు, ఉప్పు - తగినంత, కారం - చెంచాన్నర, పసుపు - కాస్త, ఉల్లిపాయలు - ఒకటి, టమోటాలు - మూడు, వెన్న - చెంచా.

తయారు చేయు విధానం :
ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, మిరియాలు, కారం, యాలకలు తదితర మసాలా సామానంతా కలిపి నూరి పెట్టుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కలిపి బొప్పాయి పేస్ట్‌ను కూడా కలిపి గంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరను సన్నగా, ఉల్లిపాయలను చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి.

పెరుగులో కుంకుమ పువ్వు, పసుపు రంగు ఫుడ్ కలర్‌ను వేసి కలిపి దీనిని కోడి మాంసానికి బాగా అంటేలా కలపాలి. దీనిని ఓ పావు గంట పాటు నాననిచ్చాక పొయ్యి మీద సెగలో ఉంచి ఉడికేంత వరకు అటు ఇటు తిప్పుతూ పైపైన వెన్న రాయాలి. ఆ తర్వాత దించి ఉల్లిపాయ, టమాటా ముక్కలను అలంకరించి పైన కొత్తిమీరను జల్లి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu