Article Indian Cookery %e0%b0%ac%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%95%e0%b0%be%e0%b0%af %e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%a1%e0%b0%bf 107081100027_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెండకాయ పచ్చడి

Advertiesment
బెండకాయల్ని శుభ్రం చేసుకుని ఆరబెట్టి ముక్కులుగా తరిగి
కావలసిన పదార్థాలు:
బెండకాయలు: పావు కిలో
ఎండుమిరప కాయలు: పది
నిమ్మకాయంత: చింతపండు
పసుపు, ఇంగవ: చిటికెడు
పోపు దినుసులు: మూడు స్పూన్లు

ఇలాచేయండి:
బెండకాయల్ని శుభ్రం చేసుకుని ఆరబెట్టి ముక్కులుగా తరిగి పక్కన పెట్టుకోండి. వేడయిన బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బెండకాయ ముక్కల్ని వేసి వేయించండి. బాగా వేగాక ఆ బాణలిని స్టౌవ్‌మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి. మరో బాణలిలో నూనెను పోసి బాగా కాగాక అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించండి. వీటిని రోట్లో వేసి దంచుని చింతపండు వేయండి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా రోట్లో వేసి దంచుకుని పోపుతో కలుపుకోండి. ఇది మూడు నాలుగు రోజుల వరకూ నిల్వఉంటుంది. ఈ బెండకాయ పచ్చడిని అన్నంలోకి వేసుకుంటే రుచికరంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu