Article Indian Cookery %e0%b0%ac%e0%b0%a0%e0%b0%be%e0%b0%a3%e0%b1%80 %e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d 108083000093_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బఠాణీ చాట్

Advertiesment
వంటకాలు ఇండియన్ తెల్ల బఠాణీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాట్‌మసాలా కొత్తిమీర నిమ్మరసం
FileFILE
కావలసిన పదార్థాలు :
తెల్ల బఠాణీలు... పావుకేజీ
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఏడు
చాట్‌మసాలా... ఒక టీస్పూన్
కొత్తిమీర... 5 కట్టలు
నిమ్మరసం... 2 టీస్పూన్లు
టొమోటోలు.. రెండు
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... పావు టీస్పూన్
కారం... పావు టీస్పూన్

తయారీ విధానం :
తెల్ల బఠాణీలను నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి దించి నీటిని వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో బఠాణీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చాట్‌మసాలా, మిరియాలపొడి, కొంత కొత్తిమీరను బఠాణీలు చితికిపోకుండా కలుపుకోవాలి.

చివరగా నిమ్మరసం కలిపి.. పై మిశ్రమాన్ని వడ్డించే ప్లేట్లలో పెట్టి, చుట్టూ గుండ్రంగా తరిగిన టమోటో ముక్కలను అలంరించాలి. తరువాత పైన తరిగిన కొత్తిమీరను చల్లి అతిథులకు వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu