Publish Date: Thu, 08 Jan 2009 (18:08 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (18:03 IST)
కావలసిన పదార్ధాలు :
బటర్... వంద గ్రాములు
ఉలవపిండి... వంద గ్రాములు
ధనియాల పొడి... ఒక టీస్పూన్
పసుపు... పావు టీస్పూన్
ఇంగువ... చిటికెడు
పుల్లటి పెరుగు... 200 గ్రాములు
ఉల్లి... రెండు
కారం... అర టీస్పూన్
జీలకర్ర... అర టీస్పూన్
ఎండుమిర్చి... మూడు
తయారీ విధానం :
ముందుగా పెరుగులో రెండు గ్లాసుల నీరు పోసి బాగా గిలకొట్టాలి. దీనికి ఉలవపిండి, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. బాండీలో నూనె వేసి ఇంగువ, జీలకర్ర, ఉల్లిముక్కలను కూడా జతచేసి... ఎర్రగా వేయించాలి. దీనికి ఉలవపిండి మిశ్రమాన్ని కలిపి ఉడికించి, చిక్కగా అయిన తర్వాత దించేయాలి.
చివరగా స్టవ్‌పై పాన్ పెట్టి బటర్ వేసి, కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. దీంతో పైన ఉడికించి పెట్టుకున్న కూరకు పోపు పెట్టుకోవాలి. అంతే బటర్‌కర్ట్ కర్రీ సిద్ధమైనట్లే... దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే మంచి రుచిగా ఉంటుంది.