Article Indian Cookery %e0%b0%aa%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d %e0%b0%ac%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%ae%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b0%be 108102200076_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీస్ బట్టర్ మసాలా

Advertiesment
వంటకాలు భారతీయ టొమోటో పచ్చి బఠాణీ అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతి
FileFILE
కావలసిన పదార్థాలు :
టొమోటోలు... అర కిలో
ఉల్లిపాయలు... 6 పెద్దవి
పచ్చిబఠాణీలు... 2 కప్పులు
అల్లం, వెల్లుల్లి ముద్ద... 2 టీస్పూన్లు
ఉప్పు, పసుపు... సరిపడా
కారం... 3 చెంచాలు
ధనియాల పొడి... 4 టీస్పూన్లు
మెంతి పొడి... అర టీస్పూన్
జీరకర్ర పొడి... అర టీస్పూన్
వెన్న... 2 టీస్పూన్లు
క్రీమ్ (మీగడ)... 2 టీస్పూన్లు
లవంగాలు... మూడు
పట్ట... కొంచెం
యాలకులు... నాలుగు

తయారీ విధానం :
ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకొని టొమోటోలు కలిపి మిక్సీ వేసి ఉంచాలి. బాండీలో4 గరిటెల నూనె పోసి కాగిన తరువాత లవంగాలు, యాలకులు, పట్ట వేసి వేయించి టొమోటో మిశ్రమాన్ని వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.

తర్వాత అల్లం, వెల్లుల్లి మిశ్రమం, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి కొంతసేపు వేయించాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి దాంట్లో బఠాణీ వేసి ఉడికించి మెత్తబడ్డాక పైన మెంతి, జీలకర్ర పొడి చల్లాలి. దించే ముందు వెన్న, క్రీమ్ వేసి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu