కావలసిన పదార్థాలు :
పనీర్ ముక్కలు.. పావు కేజీ
నూనె... సరిపడా
నీళ్లు... రెండు కప్పులు
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
మైదా... ఒక టీ.
గుడ్డు... ఒకటి (తెల్లసొన మాత్రమే)
కొత్తిమీర తురుము... అర కప్పు
పచ్చిమిర్చి... ఐదు
వెల్లుల్లిముద్ద.. ఒక టీ.
గ్రీన్ చిల్లీ సాస్... రెండు టీ.
సోయాసాస్.. రెండు టీ.
కారం... పావు టీ.
ఫుడ్ కలర్.. పావు టీ.
ఉప్పు... తగినంత
అజినమోటో.. పావు టీ.
తయారీ విధానం :
గుడ్డు సొన, కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, ఫుడ్ కలర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి గుజ్జుగా కలిపి పనీర్ ముక్కలకు పట్టించాలి. పావు గంటసేపు నానిన తరువాత ఆ ముక్కలను కాగుతున్న నూనెలో వేసి పకోడీల్లాగా దోరగా వేయించి తీసేయాలి.
ఆ తరువాత ఓ కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అందులోనే పనీర్ పకోడీలు, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అజినమోటోలు కూడా వేసి... రెండు కప్పుల నీటిని పోసి ఉడికించి కూర దగ్గర పడుతుండగా దించేసి కొత్తిమీర చల్లి వడ్డించాలి.