Publish Date: Thu, 31 Jul 2008 (19:13 IST)
Updated Date: Thu, 31 Jul 2008 (19:12 IST)
కావలసిన పదార్థాలు :
దొండకాయలు... పావుకిలో
ఎండుమిర్చి... 25 గ్రాములు
చింతపండు... నిమ్మకాయంత
పసుపు... చిటికెడు
ఉప్పు... సరిపడినంత
మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ముక్క... తగినంత
తయారీ విధానం :
కొంచెం నూనెలో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి వుంచుకోవాలి. దొండకాయల్ని అడ్డంగా రెండేసి ముక్కలుగా తరిగి రోట్లో వేసి కచ్చామచ్చాగా దంచిపెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన పప్పులూ, ఎండుమిర్చీ, ఇంగువ కలిపి మెత్తగా నూరుకోవాలి. దాంట్లోనే నూరిపెట్టుకున్న దొండకాయల తొక్కును కలిపి మరింత మెత్తగా నూరాలి. తరువాత ఆవాలు, జీలకర్రలతో పోపు పెట్టుకుని పచ్చడికి కలపాలి. అంతే దొండకాయపచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నం, నెయ్యిలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.