Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టొమోటోలతో పులావ్

Advertiesment
వంటకాలు భారతీయ బియ్యం టొమోటో ఉప్పు నూనె ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కారం కొత్తిమీర
కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
టొమోటో ముక్కలు... నాలుగు కప్పులు
ఉప్పు... తగినంత
నూనె... అర కప్పు
ఆవాలు... అర టీ.
కరివేపాకు... కొద్దిగా
పచ్చిమిరపకాయలు... నాలుగు
తరిగిన ఉల్లిపాయలు... ఒక కప్పు
కారం... రెండు టీ.
కొత్తిమీర... కొద్దిగా

తయారీ విధానం :
బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టి ఉంచాలి. తరువాత వాటితో అన్నం పొడిగా వండాలి. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి, చిటపటలాడుతుండగా... కరివేపాకు, పసుపు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమోటో ముక్కలు వేసి వేయించాలి.

మూతపెట్టి సన్నటి సెగపై అలాగే నాలుగు నిమిషాలు ఉంచాలి. తరువాత మూత తీసి, కలియబెట్టి.. అందులోని నీళ్ళన్నీ ఇగిరిపోయేదాక వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన వండి ఉంచిన అన్నంలోవేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే... టొమోటోలతో పులావ్ సిద్ధమైనట్లే..! దీన్ని వెజిటబుల్ సలాడ్‌తో కలిపి తింటే పసందుగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu