Article Indian Cookery %e0%b0%9f%e0%b0%ae%e0%b1%8b%e0%b0%9f%e0%b0%be %e0%b0%ae%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b0%be %e0%b0%ac%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b1%80 108092900066_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టమోటా మసాలా బజ్జీ

Advertiesment
వంటకాలు భారతీయ టమోటా కట్ పెసరపప్పు బంగాళాదుంపలు సైజు నూనె తాలింపు గరంమసాలా కొత్తిమీర పెసరపప్పు
FileFILE
కావలసిన పదార్థాలు :
టమోటాలు... పావు కేజీ
బంగాళాదుంపలు... పావు కిలో
నూనె... వేయించేందుకు సరిపడా
గరంమసాలా... కాస్తంత
కొత్తిమీర... ఒక కట్ట
పెసరపప్పు... నాలుగు టీస్పూన్లు
ఉల్లిపాయలు... మూడు
పచ్చిమిర్చి... నాలుగు
శనగపిండి... ఒక కప్పు

తయారీ విధానం :
టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి. ఈలోగా ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి.

ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జారుగా కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ అయినట్లే...! వీటికి సైడ్‌డిష్‌గా చింతపండు రసాన్ని వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu