కావలసిన పదార్థాలు : గోంగూర... రెండు కట్టలు పచ్చిమిరపకాయలు... తగినన్ని ఎండుమిరపకాయలు... పోపుకు సరిపడా నూనె... సరిపడా ఉల్లిపాయలు... రెండు వెల్లుల్లిపాయలు... గుప్పెడు రేకలు కరివేపాకు... పోపుకు సరిపడా మెంతులు... కాసిన్ని ఆవాలు, జీలకర్ర... పోపుకు సరిపడా ఉద్దిపప్పు, శనగపప్పు... పోపుకు సరిపడా ఇంగువ పొడి... చిటికెడు
తయారీ విధానం : ముందుగా గోంగూరను విడిపించుకుని, నీటిలో రెండు లేదా మూడుసార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలను తొడిమలు తీసి పక్కన ఉంచుకోవాలి. వెడల్పు బాణలిలో కాస్తంత నూనె వేసి వేడిచేయాలి. అందులో ముందుగా పచ్చిమిర్చి వేసి, కాసేపు వేగిన తరువాత గోంగూరను వేసి మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి.
ఆవిరికి ఉడికి గోంగూర బాగా దగ్గరై ముద్దగా వచ్చిన తరువాత దించేసి పక్కన వేడి పోయేంతదాకా ఆరబెట్టుకోవాలి. తరువాత గోంగూర ముద్దకు ఉప్పు కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
తాలింపు పెనంలో కాస్తంత ఎక్కువగానే నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువపొడి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కలిపి పోపు పెట్టుకోవాలి.
WD Photo
WD
పోపుగింజలు, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తరువాత మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలియబెట్టాలి. ఉప్పు సరిపోయేంత ఉందో, లేదో చూసుకుని ఆయిల్ పైకి తేలేంతదాకా సన్ననిమంటపై కాసేపు ఉంచాలి. అంతే పుల్ల పుల్లని గోంగూర పచ్చడి రెడీ.
తెలుగువారి లోగిళ్ళలో ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండే ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నానికి కమ్మటి నేతిని కలుపుని తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ ఆనందం మీకు కూడా అనుభవంలోకి రావాలంటే వెంటనే గోంగూర పచ్చడిని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు కదూ...!