Article Indian Cookery %e0%b0%95%e0%b1%87%e0%b0%b0%e0%b0%9f%e0%b1%8d %e0%b0%aa%e0%b0%be%e0%b0%af%e0%b0%b8%e0%b0%82 108072200070_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరట్ పాయసం

Advertiesment
వంటకాలు భారతీయ కేరట్ పాయసం పాలు పంచదార నెయ్యి వెన్న
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
కేరట్లు... పావు కేజీ
పాలు... రెండు కప్పులు
పంచదార.... ఒక కప్పు
వెన్న లేదా నెయ్యి... రెండు టీస్పూన్లు
జీడిపప్పు... కాసిన్ని
బాదంపప్పులు... కాసిన్ని
యాలక్కాయలు... నాలుగు
ఫుడ్ కలర్... సరిపడా

తయారీ విధానం :
ముందుగా కేరట్ల పై చెక్కు తీసి, తురుమి పక్కన ఉంచుకోవాలి. తరువాత పాన్‌లో పాలు, కేరట్ల తురుము వేసి తక్కువ మంటపైన పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడే అందులో యాలక్కాయల పొడిని వేయాలి. తరువాత దీనిని దించివేసి ఆరిన తరువాత మరీ పల్చగా కాకుండా మిక్సీలో రుబ్బుకోవాలి.

మళ్లీ రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి తక్కువ మంటపై 10 నిమిషాలపాటు ఉడికించాలి. దీనిని ఉడికిస్తున్నప్పుడు అడుగంటకుండా గరిటెతో కలుపుతూ, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. చక్కెరను చేర్చి బాగా కలిపిన తరువాత ఇందులోనే పాలు పోసి పొంగిపోకుండా ఉడికించాలి.

తరువాత దీనికి ఫుడ్ కలర్ కాస్తంత వేసి బాగా కలిపి, నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులను పైన చల్లాలి. అంతే కేరట్ పాయసం రెడీ. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబర్చిన తరువాత సర్వ్ చేయాలి. మంచి పోషకవిలువలు కలిగిన ఈ కేరట్ పాయసాన్ని మీరు కూడా తయారు చేస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu