Article Indian Cookery %e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%81 %e0%b0%b0%e0%b1%88%e0%b0%b8%e0%b1%8d 108092000078_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరివేపాకు రైస్

Advertiesment
వంటకాలు భారతీయ కరివేపాకు రైస్ సన్నబియ్యం నీళ్లు నూనె కప్పు లీటరు పుట్నాల పొడి
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
సన్నబియ్యం... అర కిలో
నీళ్లు... ముప్పావు లీటరు
నూనె... ఒక కప్పు
ఉప్పు... తగినంత
వేయించిన కరివేపాకు... రెండు కప్పులు (మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి)
పుట్నాల పొడి (వేయించిన శనగపప్పు పొడి)... ఒక కప్పు
చింతపండు పులుసు... అర కప్పు
వేయించి కొట్టిన ధనియాల పొడి... రెండు టీస్పూన్లు
వేరుశనగపప్పు... 50 గ్రాములు
పచ్చిమిర్చి... ఆరు (సన్నగా చీల్చాలి)
ఎండుమిర్చి... ఆరు
మినపప్పు... ఒక టీస్పూను
ఆవాలు... ఒక టీస్పూను
జీలకర్ర... ఒక టీస్పూను
పసుపు... పావు టీస్పూను
ఇంగువ... పావు టీస్పూను

తయారీ విధానం :
బియ్యం కడిగి, నీళ్లన్నీ వార్చేయాలి. వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత బియ్యం వేసి మూడు వంతులు ఉడికాక మంట తగ్గించాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి అందులో... పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె, చింతపండు పులుసు, కరివేపాకు పొడి, పుట్నాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

తరువాత మంట బాగా తగ్గించి రొట్టెల పెనం పెట్టి దానిమీద పై గిన్నెను ఉంచి మూతపెట్టి 15 నిమిషాలు ఆవిరిపోకుండా ఉంచాలి. పదిహేను నిమిషాల తరవాత బాణలిలో నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, మినపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, ఇంగువ... అన్నీ వేసి వేగాక పచ్చి మిర్చి చీలికలు కూడా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. ఈ పోపును కరివేపాకు రైస్‌లో కలిపి మరో పది నిమిషాలు మూతపెట్టి ఉంచి మగ్గనిస్తే సరి. అంతే కరివేపాకు రైస్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu