కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయలు... పావు కేజీ
చిక్కటి పాలు... రెండు కప్పులు
నూనె... 50 గ్రా.
కరివేపాకు... రెండు రెమ్మలు
ఎండుమిర్చి... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... తగినంత
కారం... అర టీ.
ఛాయమినప్పప్పు... అర టీ.
ఆవాలు... అర టీ.
జీలకర్ర... పావు టీ.
పసుపు... పావు టీ.
కొత్తిమీర తురుము... కొద్దిగా
తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి కాగాక ఛాయమినప్పప్పు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. పాలు పోసి సన్నసెగమీద ఉడికించాలి.
కూర బాగా దగ్గరగా ఉడికిన తరవాత కొత్తిమీర చల్లి దించాలి. పాలు పోసి ఉడికించడం వల్ల అవి విరిగి ఉల్లిముక్కలకు పట్టుకుని ఉండటంతో ఈ కూర, రొట్టెల్లోకీ అన్నంలోకీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!