Article Indian Cookery %e0%b0%86%e0%b0%b2%e0%b1%82 %e0%b0%ae%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 108081600045_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలూ మటర్ కర్రీ

Advertiesment
వంటకాలు భారతీయ ఆలూ మటర్ కర్రీ బంగాళాదుంప బఠాణీ ఉల్లిపాయలు టొమోటో కారం పంచదార
FileFILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... పావు కేజీ
బఠాణీలు... అర కప్పు
ఉల్లిపాయలు... మూడు
టొమోటో... ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీస్పూను
ధనియాల పొడి... ఒక టీస్పూను
కారం... కొంచెం
పంచదార... కొంచెం
ఉప్పు, నెయ్యి... సరిపడా
సోంపు... అర టీస్పూను
గరంమసాలా... అర టీస్పూను

తయారీ విధానం :
బఠాణీలను, బంగాళాదుంపలను విడివిడిగా కుక్కర్‌లో ఉడికించి తీసి బంగాళాదుంపల తోలు తీసి ముక్కలుగా చేసి ఉంచాలి. ఉల్లిపాయల్ని కచ్చపచ్చాగా మిక్సీలో వేసి దంచుకుని, టొమోటోలను వేడి నీటిలో ఉడికించి మిక్సీలో రుబ్బుకోవాలి.

తరువాత బాండీలో నెయ్యి వేసి కాగాక సోంపు, అల్లం, వెల్లుల్ని ముద్ద వేసి వేపాలి. తరువాత ఉల్లి ముద్ద వేసి వేయించి టొమోటో రసం, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు, పంచదార వేసి నెయ్యి పైకి తేలేంతవరకూ ఉడికించాలి.

వేగిన వాసన వచ్చిన తరువాత బఠాణీ, బంగాళాదుంప ముక్కలు వేసి, కొంచెం నీళ్ళు పోసి మసాలా బాగా దగ్గరకు వచ్చేంతదాకా ఉడికించుకోవాలి. ఆపై దించేముందు కొత్తిమీర చల్లి, చివర్లో కాస్తంత క్రీమ్ వేస్తే అద్భుతమైన రుచితో ఆలూ మటర్ కర్రీ మిమ్మల్ని అలరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu