Publish Date: Mon, 23 Jun 2008 (14:39 IST)
Updated Date: Mon, 23 Jun 2008 (14:38 IST)
కావలసిన పదార్థాలు :
అరటి కాయలు.... ఒకటి లేక రెండు
పచ్చిమిర్చి... ఆరు లేక ఎనిమిది
ఇంగువ... కొంచెం
తాలింపుకు రెండు స్పూన్ల కంది పప్పు
తయారీ విధానం :
ముందుగా అరటికాయలను తోలు తీసి ఉడికించి చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదా తోలుతీసి అరటికాయ మొత్తాన్ని కాల్చుకుని కూడా అరటికాయ పొడికి ఉపయోగించవచ్చు. తర్వాత వేడైన బాణలిలో నూనెపోసి, అందులో కాస్త ఆవాలను వేసి వేగాక ఉడికించిన లేదా కాల్చిన తరిగిన అరటికాయ ముక్కలను వేసి బాగా వేపాలి. దోరగా వేగాక వాటిని పొడిలా గరిటెలో కాస్త దంచుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని సెగమీద ఉంచి దించే ముందు కాస్త కొత్తిమీర తరుగును చల్లి దించేసుకోవాలి. ఈ అరటికాయ పొడిని వైట్‌రైస్‌కు సైడిష్‌గా వాడుకుంటే రుచికరంగా ఉంటుంది.