Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మునగాకు పొడి- వేడి వేడి అన్నం- ఒక స్పూన్ నెయ్యితో కలుపుకుని తింటే?

Advertiesment
మునగాకు పొడి- వేడి వేడి అన్నం- ఒక స్పూన్ నెయ్యితో కలుపుకుని తింటే?
, గురువారం, 11 జులై 2019 (14:48 IST)
మునగాకులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజుకి 8 గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్‌‌గా తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు చాలామటుకు తగ్గిపోతాయి. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. దీంతో మ‌ధుమేహం ఉన్న వారికి మున‌గాకు చ‌క్క‌ని ఔష‌ధమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
ఐదు రకాల క్యాన్సర్లను మునగాకు దూరం చేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా మునగాకుకు వుందని.. యాంటీ ట్యూమర్‌గానూ మునగాకు పనిచేస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాంటి మునగాకును తప్పకుండా వంటల్లో చేర్చుకోవాలి. వారానికి మూడు సార్లు మునగాకును డైట్‌లో చేర్చుకోవాలి. వేపుడు, కూరలు, పచ్చళ్లుగా దీన్ని వాడుకోవచ్చు. అంతేగాకుండా.. మునగాకు పొడిని కూడా వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి తగిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇక మునగాకుతో పొడి ఎలా చేయాలో చూద్దాం... 
తాజాగా ఉన్న లేత ఆకులని తీసుకుని శుభ్రంగా నీటిలో కడిగి నీడపట్టున ఆరబెట్టుకోవాలి. తెల్లని కాటన్‌ వస్త్రాన్ని దానిపై పరిస్తే రంగు మారకుండా ఉంటుంది. అలా వారం రోజుల పాటు ఆరబెట్టుకుంటే ఆకులు గలగలమంటూ ఎండిపోతాయి. 
 
ఈ మునగాకుల్ని అలానే డబ్బాలో దాచుకుని పప్పులో వేసుకోవచ్చు. లేదంటే మిక్సీ పట్టుకుని పొడిచేసి తేమలేని డబ్బాలో భద్రపరుచుకోవచ్చు. ఈ పొడిని జ్యూసుల్లో, సూపుల్లో, చపాతీల్లో, దోసెల్లో వాడుకుంటే రక్తహీనత రాకుండా ఉంటుంది. 
 
పిల్లల్లో ఎదుగదలకు ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా మధుమేహులు మునగాకు పొడిని రోజూ వేడి వేడి అన్నంలో.. ఓ స్పూన్ నెయ్యి కలుపుకుని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి చూర్ణం.. తేనెతో నోటి పుండ్లు మటాష్