Publish Date: Fri, 01 Apr 2016 (10:00 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (10:02 IST)
పిల్లలు వేసవి సెలవుల్లో ఇంట్లో ఉంటారు. వారికి బోర్ కొట్టకుండా వుండేందుకు ఆడుకోనివ్వడంతో పాటు వెరైటీ వెరైటీగా వంటకాలు తయారు చేసి సర్వ్ చేయాలి. బ్రెడ్‌ను ఎప్పుడూ జామ్ అందించడం కంటే బ్రెడ్ పకోడీలా ట్రై చేసి చూడండి.
కావలసిన పదార్థాలు :
శనగపిండి - రెండు కప్పులు.
జొన్నపిండి - ఒక కప్పు
కొత్తిమీర - అరకప్పు
ఉప్పు - సరిపడినంత.
నూనె - సరిపడినంత.
మజ్జిగ - ఒక కప్పు.
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లిపాయలు - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - తగినంత
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, ఉప్పు వేసి ఈ మిశ్రమంలో సరిపడినన్ని నీళ్ళ పోసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాటో సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. పిల్లలు ఇష్టపడి తింటారు.
chitra
Publish Date: Fri, 01 Apr 2016 (10:00 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (10:02 IST)