Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బెండ' కాదు.. పోషకాల కొండ....

ప్రకృతి ప్రసాదించిన కాయకూరల్లో బెండకాయలు ఒకటి. వీటిని ఫ్రై చేసినా, పులుసు పెట్టినా అవి చాలా రుచికరంగానే ఉంటాయి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరు పెద్దగా ఇష్టపడరు. అయితే మనకు రుచిని ఇవ

'బెండ' కాదు.. పోషకాల కొండ....
, శుక్రవారం, 22 జూన్ 2018 (12:25 IST)
ప్రకృతి ప్రసాదించిన కాయకూరల్లో బెండకాయలు ఒకటి. వీటిని ఫ్రై చేసినా, పులుసు పెట్టినా అవి చాలా రుచికరంగానే ఉంటాయి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరు పెద్దగా ఇష్టపడరు. అయితే మనకు రుచిని ఇవ్వడంలోనే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ బెండకాయ అమోఘంగా పనిచేస్తుంది.
 
కనీసం వారంలో రెండు సార్లు బెండకాయలను ఆరగించడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాదు, వాటి వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ క్రమంలోనే బెండకాయల వల్ల మనకు ఎలాంటి లాభాలపై ఓ లుక్కేద్దాం. 
 
* బెండకాయల్లోని విటమన్ కె ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రక్త స్రావ సమస్యలున్నవారికి కూడా మేలు చేస్తుంది.
* వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నందున శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. 
* నేత్ర సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.
* కడుపులో ఉండే చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది.
* బెండకాయలను తరచూ తినడం వల్ల లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* నిత్యం ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యేవారు తమ ఆహారంలో బెండకాయలను చేర్చుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
* మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్‌ను నివారిస్తుంది.
* బెండకాయలో ఉండే విటమిన్ సి శ్వాస కోశ సమస్యలను పోగొడుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది.
* వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. 
* బెండకాయల్లో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నీరసం, అలసట రాకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు బెండకాయలు దోహదం చేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''