మునగ ఆకుల పొడిని రోజూ 2 స్పూన్లు తీసుకుంటే...
ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు అనేకం ఉన్నాయి. వీటిలో మనకు తెలిసి ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. మునగాకు చెట్టుకు సూపర్ హీరో అనే పేరు కూడా ఉంది.
ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు అనేకం ఉన్నాయి. వీటిలో మనకు తెలిసి ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. మునగాకు చెట్టుకు సూపర్ హీరో అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు కాయలతో సాంబారు పెట్టుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చిన్నవారి నుంచి పెద్దవారు వరకు లొట్టలేసుకుని తాగేస్తుంటారు. అలాగే, ఈ చెట్టు ద్వారా లభించే ప్రతిదీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ చెట్టు ఆకుల గురించి (మునగాకు) పెద్దగా చెప్పనక్కర్లేదు. అలాగే, విత్తనాలు, పువ్వులు, వేర్లు.. ఔషధాల తయారీలో కూడా వాడుతారు. ఈ ఆకులను ఎండబెడితే ఇందులో 30 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ ఆకుల్లో ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. వీటిని సుధీర్ఘకాలంపాటు ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎనీమియా, ఆర్థరైటిస్, లివర్ వ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు.