Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొప్పాయి పండే కాదు.. బొప్పాయి ఆకులతోనూ ఎన్నో ప్రయోజనాలు..

సాధారణంగా బొప్పాయి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఉదయాన్నే బొప్పాయి పండును ఆరగిస్తారు. ఈ పండును దేవదూత పండు అని పిలుస్తారు. ఈ పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

బొప్పాయి పండే కాదు.. బొప్పాయి ఆకులతోనూ ఎన్నో ప్రయోజనాలు..
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (09:33 IST)
సాధారణంగా బొప్పాయి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఉదయాన్నే బొప్పాయి పండును ఆరగిస్తారు. ఈ పండును దేవదూత పండు అని పిలుస్తారు. ఈ పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. భోజనం చేశాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయి తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికట్టవచ్చు. ఉడికించిన కోడిగుడ్డు, బొప్పాయి పండు ముక్కలతో కలిపి తింటే కాలేయ వ్యాధులు దరిచేరవు. అలాగే, బొప్పాయి ఆకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
 
బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారిని ఈ జ్యూస్‌ తాగమంటారు. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ-మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిన్‌ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇందులోని యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. 
 
ఈ జ్యూస్ పెప్టిక్‌ అల్సర్లను కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది. శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. ఆకులోని యాంటాక్సిడెంట్లు కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్‌ సమస్యను నివారిస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూసు ఆడవాళ్లకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. 
 
బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూసు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో కాంతిమంతంగా ఉంటుంది. బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్‌ కండిషనర్‌గా పనిచేస్తూ శిరోజాలను కాంతిమంతంగా ఉంచుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?