Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?

చాలామందికి బస్సు ప్రయాణం పడదు. ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు. కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటుంటారు. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్క

ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (19:53 IST)
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు. కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటుంటారు. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.
 
ఇకపోతే అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది. అలాగే జలుబు, దగ్గు బాధిస్తుంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధలనుండి ఉపశమనాన్ని పొందవచ్చు. డికాక్షన్‌లో కొద్దిగా అల్లం, తేనె, తులసి ఆకులను వేసి కలుపుకుని తాగినా కూడా ఈ బాధలనుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. 
 
కీళ్లనొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రోజూ కొద్దిమేర అల్లం కూరల్లో తీసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదం పప్పులు తింటే ఏంటి లాభం?