Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

Advertiesment
lemon

ఠాగూర్

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:40 IST)
అన్ని కాలాల్లో లభించేది నిమ్మకాయ. ఇది పిడికెడంత కూడా ఉండదు. అలాంటి నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. వంటలు, స్కిన్ కేర్, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్ ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపా(డీహైడ్రేషన్)న్ని నివారించే దివ్యౌషధం నిమ్మకాయలు. డీహైడ్రేషన్‌కు గురైనవారు నిమ్మరసం తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో నిమ్మకాయలు నిల్వవుంటాయి. అయితే నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయడం, చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 
 
నిల్వ చేయడానికి నిమ్మకాయలు కొనుగోలు చేస్తే మాత్రం వాటిని శుభ్రంగా, మచ్చలులేనివిగా చూసి కొనుగోలు చేయాలి. ఒకవేళ నిమ్మకాయపై మరక లేదా మచ్చ కనిపిస్తే వాటిని తొలగించాలి. ఎందుకంటే వీటివల్లే నిమ్మకాయ త్వరగా చెడిపోతుంది. ఎల్లపుడు నిల్వ కోసం తాజా నిమ్మకాయలనే కొనాలి. అపుడే అవి నెలల తరబడి నిల్వవుంటాయి. 
 
తాకడానికి మృదువుగా ఉంటూ పల్చని తొక్కలు కలిగిన జ్యూసీ నిమ్మకాయలనే నిల్వ కోసం కొనుగోలు చేయాలి. మందంగా ఉన్న తొక్కలు కలిగిన నిమ్మకాయలతో పోలిస్తే రసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఆవిరైపోవు. 
 
నిమ్మకాయలను ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో ఉంచండి. నిమ్మకాయను ఉపయోగించే ముందు వేడి నీటిలో వేసి పది నిమిషాలు ముంచండి. నీరు మరిగేలా జాగ్రత్త వహించండి. అది మెత్తగా మారినపుడు దానిని నీటి నుంచి తీసి పిండితే అధిక మొత్తంలో రసం వస్తుంది. 
 
గాలి చొరబడని గాజుపాత్రలో నిమ్మకాయలను ఉంచి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. నిమ్మకాయలను ఒకటి లేదా రెండు నెలల పాటు నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. 4-5 నెలలపాటు నిల్వ ఉంచాలంటే మాత్రం ఫ్రీజల్‌‍లో ఉంచాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు