Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

Advertiesment
Aghori New Look

సెల్వి

, ఆదివారం, 24 నవంబరు 2024 (13:02 IST)
Aghori New Look
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీ తాజాగా కొత్త అవతారంలో కనిపించారు. మొన్నటి వరకు మహిళా అఘోరీగా దర్శనమిచ్చింది. తాజాగా గడ్డం, మీసంతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 
 
అఘోరీని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. అఘోరీ వద్ద నిమ్మకాయలు ఉండటంతో వాటితో ఏం చేస్తున్నావని కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించారు. తాను దిష్టి తీస్తున్నట్లు అఘోరీ బదులివ్వగా అందుకు స్థానిక మహిళలు శాంతించలేదు. ఆమె క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు జడుసుకుంటున్నారు. ఇంకా కారు నుంచి కిందకు దిగాలని మహిళలు పట్టుబట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
 
కాగా.. గత కొద్ది కాలంగా సంచిరిస్తున్న అఘోరీ మొదట తను లేడీనని ప్రచారం చేసింది. ఆ తర్వాత అమె తల్లి దండ్రులు అమ్మాయి కాదు అబ్బాయి కాదు ట్రాన్స్‌జెండర్ అని చెప్పడంతో నిర్ధారణ అయింది. కొన్నాళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా సంచరిస్తూ పలు విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం గడ్డం, మీసాలతో, గాజులు వేసుకుని కారులో కూర్చున్న అఘోరీతో.. ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. 
 
భగవంతుడికి. భక్తుడికి మధ్య అనుసంధానంగా తానున్నానంటూ లేడీ అఘోరీ నాగసాధువు తెలుగునాట ప్రత్యక్షమైంది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?