Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంటింటి వస్తువులతో పేలకు చెక్...!

Advertiesment
home remedies head lice
తలపై వెట్రుకల్లో పేలు చేరడం సర్వసాధారణం. అయితే ఏ మాత్రం నెగ్లెట్ చేసినా అవి తలను తినేస్తాయి. అంటే పేనుకాటు.. వెంట్రుకలు ఊడిపోవడం, దురద, వంటి పలు సమస్యలకు దారి తీస్తాయి. తలపై పేను పోగొట్టేందుకు ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందడమో, లేక బ్యూటీ పార్లర్లకు వెళ్లి రసాయనాలను ఉపయోగించాల్సి అవసరం లేదు.
 
ఎందుకంటే తలపై పేలను పోగొట్టేందుకు ఇంటిలోపలి వంట గదిలో ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటే చాలు. వంటింటి యువరాణిగా చెప్పుకునేది వస్తువు ఉప్పు. ఉప్పు రుచికే కాదు తలపై పేలను హరించేందుకు బాగా ఉపయోగపడుతుంది. అరకప్పు వెనిగర్‌లో ఐదు స్పూన్స్ ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఒక షవర్ క్యాప్ ధరించి రెండు గంటలు అయ్యాక మీ జుట్టు కడగడం మరియు దువ్వటం చేయాలి. అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తే సరి. పేలు పూర్తిగా నాశనమవుతాయి.
 
అదేవిధంగా వెల్లుల్లి బలమైన వాసన వలన కూడా పేలు చనిపోతాయి. వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే చనిపోయిన బయటపడటం మీరు స్పష్టంగా గుర్తించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu