Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరం నుంచి వాసన వస్తోందా..! అయితే ఇలా చేయండి

శరీరం నుంచి వాసన వస్తోందా..! అయితే ఇలా చేయండి
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (19:41 IST)
ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మందిని చెమట సమస్య పట్టిపీడిస్తుంటుంది. ఈ చెమటకు చాలా కారణాలున్నాయి. బయట వేడి పెరిగితే చెమట పెరుగుతుందని అనుకోవడం పొరబాటు. శరీరంలో జరిగే మార్పులకు అది తోడవుతుందంతే. అలసట, ఆకస్మిక అశాంతి, సంశయం, చికాకు వలన చెమట వస్తుంది. స్వేధ గ్రంధుల నుంచి చెమట ఉత్పత్తి అవుతుంది. శరీర దుర్వాసనకు స్వేధ గ్రంధులే ముఖ్య కారణం. 
 
చెమట వాసన రాకుండా ఉండేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రతీ రోజు కనీసం రెండు సార్లు ఉదయం లేవగానే ఒకసారి మరియు రాత్రి పడుకునే ముందు ఇంకొకసారి స్నానం చేయడం ఉత్తమం. దుర్వాసన తగ్గుతుంది. నీటిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి స్నానం చేస్తే సువాసన వెదజల్లుతుంది.
 
నిమ్మకాయలకి చెడు వాసనని నివారించే శక్తి పుష్కలంగా ఉంటుంది. రసం తీసేసిన నిమ్మకాయ చెక్కలను స్నానపు తొట్టిలో ఉంచండి. ఇదే విధంగా తెల్లని వెనిగర్, టమోటాలు, ఆపిల్ పళ్ళ రసం లేదా తినే సోడాతో కూడా ప్రయత్నించవచ్చు. శరీరం సువాసన భరితంగా ఉంటుంది.
 
అల్లం, ఉల్లిపాయ, జీలకర, పొగాకు, పచ్చి మాంసం వంటివి తగ్గించడం మంచిది. వీలైతే తప్పించడం మరీ మంచిది. ఎక్కువగా నీరు త్రాగడం, రొట్టెలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు, పళ్ళ రసాలు, గోధుమ వంటకాలు చెమటను తగ్గిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu