Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చి బఠాణీలతో మలబద్దకానికి చెక్...

Advertiesment
పచ్చి బఠాణీలతో మలబద్దకానికి చెక్...
, ఆదివారం, 13 జనవరి 2019 (14:12 IST)
చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి పచ్చి బఠాణీలతో చెక్ పెట్టొచ్చు. సాధారణంగా వీటిని అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. కుర్మా, బిర్యానీ వంటివాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇవి వేయడం వల్ల కూరకు చక్కని రుచి వస్తుంది. అలాగే, ఎన్నో పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ప‌చ్చి బ‌ఠానీల‌ను త‌ర‌చూ తీసుకుంటే వాటితో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూర‌గా చేసుకుని తింటే విరేచనం సాఫీగా వస్తుంది 
* మదుమేహంతో బాధపడేవారికి పచ్చి బఠాణీలు చక్కటి ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్-2 మదుమేహం ఉన్నవారికి ఇవి బాగా పని చేస్తాయి. 
* చెడు కొలెస్ట్రాల్‌ను నాశనం చేసి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.
* పచ్చి బఠాణీల్లో కేన్సర్‌కు వ్యతేరికంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధల్లో తేలింది.
 
* 100 గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.
* పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం.
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చుకోవాలంటే...