Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీరకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే ఏమవుతుంది?

Advertiesment
బీరకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే ఏమవుతుంది?
, సోమవారం, 24 డిశెంబరు 2018 (14:17 IST)
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ వీటిని తీసుకుంటే.. శరీరానికి అవసరమయ్యే న్యూట్రియన్స్, మినరల్స్ క్రమంగా అందుతాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాలతో పాటు ఇతర రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణకు బీరకాయ.. దీనిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 

బీరకాయ జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ చూడడానికి కీరదోసలానే ఉంటుంది. అయితే.. బీరకాయ తొక్క గరుకుగా ఉంటుంది. ఈ తొక్కను శుభ్రం చేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. ఆపై మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిలో కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి మళ్లీ పొడి చేయాలి. ఇలా చేసిన పొడిని రోజుకు ఒక్కసారైనా అన్నంలో కలిపి తీసుకుంటే.. చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చును.
 

చాలామందికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తిన్నామ లేదా అన్న విషయాన్ని కూడా మరచిపోతుంటారు. అలాంటప్పుడు బీరకాయ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై నూనెలో వీటిని వేసి వేయించి ఉప్పు, కారం, కొబ్బరి తురుము, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజూ క్రమంగా తింటే.. మతిమరుపు తగ్గుముఖం పడుతుంది.
 

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. బీరకాయ తప్పక తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు. శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన చాలామంది చూడడానికి నీరసంగా కనిపిస్తారు. అలాంటివారు క్రమంగా బీరకాయ కూరో లేదా వేపుడు తీసుకుంటే చాలు.. ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. బీరకాయ తీసుకుంటే జ్ఞాపకశక్తి  కూడా అధికమవుతుంది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సూపర్ ఫుడ్స్...