శరీరంలో ఏదైనా నొప్పి అనిపిస్తే వెంటనే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటాం. కానీ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మన వంటిట్లోనే వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
దంతాలు నొప్పిగా వున్నప్పుడు ఓ లవంగం చప్పరిస్తే నొప్పి తగ్గుతుంది.
గొంతునొప్పిగా వున్నప్పుడు కాస్తంత తేనెను సేవిస్తే ఫలితం వుంటుంది.
కీళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తున్నప్పుడు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
బ్లాడర్ సమస్యలతో వున్నవారు బ్లూబెర్రీలు తింటుండాలి.
సీజనల్ వ్యాధులు రాకుండా వుండాలంటే పసుపు పాలు తాగుతుండాలి.
కడుపులో నొప్పికి పుదీనా నీరు తాగితే మేలు చేస్తుంది.
కడుపులో వికారంగా వున్నప్పుడు అల్లం టీ తాగితే సర్దుకుంటుంది.