Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విక్టరీ వెంకటేష్ ‘శివం భజే’ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు : నిర్మాత మహేశ్వర్ రెడ్డి

Producer Maheshwar Reddy

డీవీ

, మంగళవారం, 30 జులై 2024 (19:57 IST)
Producer Maheshwar Reddy
అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'శివం భజే'. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన చిత్ర సంగతులివే..
 
శివం భజే కథను ముందుగా నేను విన్నాను. నాకు చాలా నచ్చింది. విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఈ కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా వెంటనే నచ్చింది. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేశారు. అలా ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.
 
కథను పూర్తిగా  రివీల్ చేయలేను. చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్‌కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిపినట్టు ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేలా అంశాలు ఉంటాయి. ట్విస్టులను అయితే ఇప్పుడు రివీల్ చేయలేను. నేను శివుడి భక్తుడ్ని కాబట్టి..  ఈ సినిమాను తీయలేదు, కథ చాలా బాగుంటుంది.
 
శివం భజే చిత్ర విడుదలకు ఇదే సరైన సమయం అని భావించాను. డిస్ట్రిబ్యూటర్‌గానూ ఆలోచించాను. అందుకే ఈ డేట్‌ను ఫిక్స్ చేశాం. ఇక మున్ముందు పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. క్వాలిటీ, కంటెంట్ కోసం అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే బడ్జెట్ పెట్టాను.
 
మ్యూజిక్ డైరెక్టరే ఈ చిత్రానికి హీరో. హిడింబ చూశాక ఆయన్ను తీసుకోవాలని అనుకున్నాం. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీని హైద్రాబాద్ చుట్టూనే తీశాం. కథ కూడా పూర్తిగా ఇక్కడే తిరుగుతుంది.
 
విక్టరీ వెంకటేష్ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. ఇంత వరకు ఈ చిత్రాన్ని ఎవ్వరికీ చూపించలేదు. అశ్విన్ కి, వెంకటేష్ కి క్రికెట్ వల్ల మంచి రిలేషన్ ఉంది. ట్రైలర్ చూడటంతో ఆయనకి నచ్చి అభినందించారు.
 
కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమా చూస్తారు. టికెట్ రేట్లు తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా కూడా సినిమా బాగుందనే మౌత్ టాక్ వస్తేనే సినిమాను చూస్తారు.
 
ఐఐటీ కృష్ణమూర్తి టీంతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఈ చిత్రం హిట్ అయితే.. రెండో పార్ట్‌ని కూడా ప్లాన్ చేస్తాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డార్లింగ్ ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న మృణాల్ ఠాకూర్?