Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీధి పిల్లలతో క్రికెట్ ఆడిన విక్టరీ వెంకటేష్

Advertiesment
venkatesh
, బుధవారం, 13 డిశెంబరు 2023 (12:07 IST)
వీధి పిల్లలతో విక్టరీ వెంకటేష్ క్రికెట్ ఆడారు. ఆయన తాజా చిత్రం నటించిన "సైంధవ్" విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా మూవీ రూపొందించిన ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేశ్ ఆంధ్రా పర్యటించారు. విజయవాడ, గుంటూరులో సందడి చేశారు. బెజవాడ కనకదుర్గమ్మను ఈ సినిమా బృందం దర్శించుకుంది. అనంతరం బాబాయ్ హోటల్‌లో వెంకటేశ్ సందడి చేసిన విషయం తెల్సిందే. 
 
వెంకటేశ్‌తో పాటు హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్, సైంధవ్ టీమ్ వివిధ సిటీలు తిరుగుతూ సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ దేశ వ్యాప్తంగా విడుదలకానుంది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్‌లతో పాటు ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయవాడ నుంచి గుంటూరు చేరుకున్న సైంధవ్ టీమ్, వీవీఐటీ కాలేజీలో ఓ పాటను రిలీజ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరులో కాలేజీలో విద్యార్థులతో కలిసి వెంకటేశ్‌ సందడి చేశారు. వీవీఐటీ, కేఎల్ యూనివర్శిటీ మధ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రమంలో వెంకటేశ్ కాసేపు బ్యాటింగ్ చేసి విద్యార్థులను ఆలరించారు. వీవీఐటీ విద్యార్థులతో వెంకటేశ్, శైలేశ్ కొలను టీమ్ టీమ్ తలపడింది. ఈ గల్లీ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "వెంకీ మామా బ్యాటింగ్ అదుర్స్" అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన భారతీయ యువ క్రికెటర్.. ఎవరు?