Publish Date: Mon, 23 Feb 2015 (09:07 IST)
Updated Date: Mon, 23 Feb 2015 (09:12 IST)
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్ జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ 87వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది.
అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ తారలతో పాటు వివిధ దేశాలకు చెందిన సినీ స్టార్ ఇక్కడికి చేరుకుని హంగామా సృష్టిస్తున్నారు. కాగా ఈ ఏడాదికిగాను ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ఐడా' (పోలాండ్), ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్', ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1', ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మలోన (ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్), ఉత్తమ సహాయ నటి పెట్రిసియా ఆర్వైడ్ (బాయ్హుడ్), ఉత్తమ సౌండ్ ఎటిడింగ్ 'అమెరికన్ స్నైపర్' అందుకున్నారు.