Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందం కోసం వందకి మించిన ప్లాస్టిక్ సర్జరీలు.. మోడల్ మృతి.. ఫోటోలు వైరల్..

వరుసగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న మోడల్ ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం ఏకంగా వందకు మించిన ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న కెనడా నటి క్రిస్టినా గుండెపోటుతో మరణించింది. అయితే ఆమె అందాలకు సంబంధించిన ఫో

Advertiesment
అందం కోసం వందకి మించిన ప్లాస్టిక్ సర్జరీలు.. మోడల్ మృతి.. ఫోటోలు వైరల్..
, గురువారం, 22 జూన్ 2017 (14:18 IST)
వరుసగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న మోడల్ ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం ఏకంగా వందకు మించిన ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న కెనడా నటి క్రిస్టినా గుండెపోటుతో మరణించింది. అయితే ఆమె అందాలకు సంబంధించిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెనడాకు చెందిన క్రిస్టినా.. తన 17వ సంవత్సరం నుంచే ప్లాస్టిక్ సర్జరీ చేయడం ప్రారంభించింది. 
 
ఎప్పుడు పడితే అప్పుడు ప్లాస్టిక్ సర్జీరీ చేసుకునేది. పెదవులు, ఎద అందాలు, పిరుదులను అందంగా చూపేందుకు సర్జరీ చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ.. అందాన్ని ఎత్తిచూపడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నానని వెల్లడించింది.
 
ఇలా వందకు మించిన ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న క్రిస్టినాకు.. ఇటీవల చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ బెడిసికొట్టింది. ప్లాస్టిక్ సర్జరీ చేస్తుండగా క్రిస్టినా గుండెపోటుతో మృతి చెందింది. దేనినైతే ఆమె ఇష్టపడి చేసిందో.. అదే ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టింది. ఈ వార్త క్రిస్టినా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. క్రిస్టినా ఘటన ద్వారా అప్పుడప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారికి వార్నింగ్ ఇచ్చినట్లైంది. ప్రస్తుతం క్రిస్టినా ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జక్కన్నను ''అమ్మ నీ...'' అని ప్రభాస్ ఎందుకన్నాడు..?