Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జక్కన్నను ''అమ్మ నీ...'' అని ప్రభాస్ ఎందుకన్నాడు..?

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. బాహుబలి, బాహుబలి-2

Advertiesment
జక్కన్నను ''అమ్మ నీ...'' అని ప్రభాస్ ఎందుకన్నాడు..?
, గురువారం, 22 జూన్ 2017 (14:03 IST)
బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. బాహుబలి, బాహుబలి-2 సినిమాలు విడుదలై రికార్డులు సృష్టించాయి. బాహుబలి-2తో బాహుబలికి శుభం కార్డు పలుకుతానని ఇదివరకే రాజమౌళితో పాటు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా తేల్చేశారు.
 
బాహుబలి-2 విడుదలై మంచి సక్సెస్ సాధించిన తర్వాత ''బాహుబలి-3'' సినిమాపై ఎన్నో కథనాలు వచ్చాయి. 'బాహుబలి-2'కి సీక్వెల్ ఉంటుందా? లేదా? వంటి ప్రశ్నలకు రాజమౌళి స్పందిస్తూ... 'బాహుబలి-3' సినిమా తీసే ఆలోచన లేదని తేల్చేశారు. తాజాగా రానా, జక్కన్నల మధ్య బాహుబలి-3 ప్రస్తావన వచ్చింది. బుల్లితెరపై 'నెంబర్ వన్ యారీ విత్ రానా' అనే షో చేస్తున్నాడు. ఈ షో జూన్ 25 నుంచి ప్రసారం కానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ షోకు గెస్టుగా రాజమౌళిని రానా ఆహ్వానించాడు. ఇందులో భాగంగా రాజమౌళి.. ప్రభాస్‌కి ఫోన్ చేసి.. ''డార్లింగ్‌ అర్జెంటుగా కలవాలి" అనగానే, ప్రభాస్‌.. "ఎందుకు?" అని ప్రశ్నించాడు. "బాహుబలి పార్ట్ 3'' కోసం అని దర్శకధీరుడు సమాధానమిచ్చాడు. ఆ వెంటనే.. అటువైపు నుంచి ప్రభాస్‌ ఒక్కసారి ఆశ్చర్యపోయి..''అమ్మ నీ యమ్మా" అన్నాడు. దీంతో రానా, రాజమౌళి పెద్దగా నవ్వేశారు.
 
ఫోనులో జక్కన్నతో మాట్లాడుతూ ''అమ్మ నీ యమ్మా'' అన్న ప్రభాస్ ముఖం ఎలా పెట్టాడో చూడలేకపోయారు కానీ రాజమౌళి, రానా మాత్రం పెద్దగా నవ్వేశారు. కాగా ప్రభాస్ ఐదేళ్ల పాటు బాహుబలి కోసం కష్టపడ్డాడు. బరువు పెరిగాడు. ఎన్నెన్నో సాహసాలు చేశాడు. మళ్లీ జక్కన్న బాహుబలి 3 అనేసరి ప్రభాస్ అవాక్కయ్యాడు. మరి రాజమౌళి బాహుబలికి శుభం పలుకుతాడో లేదో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధ సాంగ్ రిలీజ్ చేసిన షారుక్... అనుష్క శర్మ ఎలా ఉందంటే... (Video)