Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో విబేధాలు.. విడాకులు కోరిన కిమ్ కర్దాషియన్.. నలుగురు పిల్లల పరిస్థితి..?

Advertiesment
భర్తతో విబేధాలు.. విడాకులు కోరిన కిమ్ కర్దాషియన్.. నలుగురు పిల్లల పరిస్థితి..?
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:26 IST)
Kim Kardashian
ర్యాపర్ అయిన తన భర్త కాన్యేవెస్ట్‌తో విబేధాలు పెరగడంతో అమెరికన్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ విడాకులు కోరింది. తన లాయర్… లారా వాసర్ ద్వారా శుక్రవారం ఆమె అతనికి డైవోర్స్ నోటీసు పంపింది. కాన్యే కూడా ఈమె నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపినట్టు తెలుస్తోంది. 
 
ఏడేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. ఆ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తాను కూడా రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కాన్యే హడావుడి చేశాడు. దాంతో అతని మానసిక స్థితిపై పలువార్తలు వచ్చాయి. అప్పుడే అతనికి కర్దాషియన్ డైవోర్స్ ఇవ్వవచ్చునని ఊహాగానాలు రేగినప్పటికీ..ఆమె వాటిని కొట్టి పారేసింది. అలాంటి యోచన లేదని క్లారిటీ ఇచ్చింది. 
 
కానీ రోజురోజుకీ వీరిమధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, లీగల్‌గా విడిపోవాలని నిశ్చయించుకున్నారని తాజాగా తెలుస్తోంది. కాన్యేకి డైవోర్స్ ఇస్తున్నందుకు తనకు విచారంగా ఉందని, అదే సమయంలో ఈ ప్రక్రియ ప్రొసీడింగ్స్‌తో కాస్త ఉపశమనం పొందుతున్నానని కూడా కర్దాషియన్ పేర్కొంది. 
 
అనేక సార్లు ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. తమ నలుగురు పిల్లలకు లీగల్, ఫిజికల్ కస్టడీ ముఖ్యంగా తనకు కావాలని కర్దాషియన్ కోరుతోంది. అయితే ఏది ఏమైనా…. ఈ పిల్లలు ఈమె వద్దే ఉంటారని, కాన్యే వెస్ట్ తాను ఎప్పడు కోరినా వారిని విజిట్ చేయవచ్చునని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మి శరత్‌కుమార్‌కు టాలీవుడ్‌లో దశ తిరిగిందా?