Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువకుడితో భార్య వివాహేతర సంబంధం, విడాకులివ్వమన్న భర్త

Advertiesment
Wife
, బుధవారం, 6 జనవరి 2021 (21:19 IST)
ముగ్గురు పిల్లల తల్లి ఆమె. భర్త బిజీ ఉద్యోగం. వారం రోజుల పాటు బయటి ప్రాంతాల ఉంటూ వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కోరికలు చంపుకోలేని ఆ వివాహిత పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
 
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో నివాసముండే జమునాబాయికి ముగ్గురు పిల్లలు. భర్త రాంలాల్. అయితే రాంలాల్ నిత్యం పనుల మీద ఢిల్లీకి వెళ్ళేవాడు. కుటుంబ సభ్యులను అక్కడే వదిలి ఢిల్లీకి వెళ్ళేవాడు. అయితే భర్త వారంరోజుల పాటు ఇంట్లో లేకపోవడంతో జమునాబాయి ఇబ్బందిగా ఫీలయ్యాది.
 
తన ఇంటికి పక్కనే ఉన్న షరీఫ్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిల్లలకు ఏ మాత్రం తెలియకుండా ఇంటి వెనుక ప్రతిరోజు రాత్రి అయితే ప్రియుడిని కలిసేది. పిల్లలు బాగా నిద్రపోయాక ఇంటి తలుపులు మూసివేసి వెనుక వైపుకు వెళ్ళి అతడిని కలిసేది.
 
ఈ సంబంధం కాస్త పిల్లలకు తెలియకపోయినా ఉదయాన్నే అతనితో పాటు ద్విచక్రవాహనంలో తిరుగుతూ ఉండేది. ఈ విషయం స్థానికుల ద్వారా భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు. యువకుడిని చితకబాదాడు భర్త రాంలాల్. అయినా ఇద్దరిలో మార్పు రాలేదు. 
 
తన భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధం కావడంతో పాటు తన పిల్లల నుంచి కూడా జమునాబాయికి తిట్లు రావడంతో ఆమె మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఉండలేక.. పిల్లలు చెప్పే మాటలు ఆమె మనస్సును నొప్పించడంతో చివరకు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కారని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ విచారణకు వచ్చిన పోలీసులు మాత్రం అసలు విషయాన్ని బయటపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇళ్లపట్టాల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.6,500కోట్ల అవినీతి: టీడీపీ