Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ అవార్డుల నామినేషన్: భారత్‌కు నిరాశ.. ఒక్క డాక్యుమెంటరీకే..?

ఆస్కార్ అవార్డుల నామినేషన్: భారత్‌కు నిరాశ.. ఒక్క డాక్యుమెంటరీకే..?
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (01:44 IST)
ఆస్కార్ అవార్డుల్లో భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది నామినేషన్స్‌లో ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది.
 
విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుపై భారతీయ ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. 
 
అయితే భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్‌లాల్ నటించిన మరక్కర్ ఫైనల్ నామినేషన్‌లోకి చేరలేకపోయాయి. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్‌ను ప్రకటించడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Oscar nominations 2022: నామినేషన్ల వివరాలు