రెండు కాళ్లు పట్టుకుని లాగాడు... అండర్ గార్మెంట్ వేస్కోలేదు... రేప్ చేస్తాడనుకున్నా... కిమ్
హాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కిమ్ కర్దాషియాన్ పైన పారిస్ లో దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఘటనపై ఆమె పెద్దగా మాట్లాడలేదు. కానీ ఆనాటి చేదు అనుభవాన్ని ఇప్పుడు తలచుకుని దాని గురించి చెప్పుకొచ్చింది. ఆనాడు తను ఎలా ఫీలయ్యానన్న సంగతి పూసగుచ్చినట్లు
హాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కిమ్ కర్దాషియాన్ పైన పారిస్ లో దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఘటనపై ఆమె పెద్దగా మాట్లాడలేదు. కానీ ఆనాటి చేదు అనుభవాన్ని ఇప్పుడు తలచుకుని దాని గురించి చెప్పుకొచ్చింది. ఆనాడు తను ఎలా ఫీలయ్యానన్న సంగతి పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
వాళ్ల దగ్గర తుపాకులు వున్నాయి. ఒకడు నా వైపు గన్ పెట్టి చూస్తున్నాడు. నేను ఆ తుపాకి వైపు మాత్రమే చూస్తున్నాను. వాళ్లేం చేస్తున్నారన్నది పట్టించుకోలేదు. అతడు తుపాకితో కాల్చి నన్ను చంపేస్తాడేమోనని భయపడ్డాను. వెనుక మెట్లు వున్నాయి. ఆ మెట్ల పైనుంచి గబాగబా దిగేసి పరుగెట్టాలని ఆలోచన వచ్చింది. ఐతే అలా పరుగెడితే అతడు కాల్చేస్తాడేమోనన్న భయం కలిగింది.
ఇంతలో దుండగుల్లో ఒకడు నా దగ్గరకు వచ్చి నోటికి ప్లాస్టరు అంటించాడు. ఆ తర్వాత నా కాళ్లు పట్టుకుని తను కూర్చున్న బెడ్ వద్దకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో నేను అండర్ గార్మెంట్స్ కూడా వేసుకుని లేను. దీనితో ఇక అతడు నాపై రేప్ చేస్తాడని మానసికంగా ఫిక్స్ అయ్యాను. కానీ వాడు ఆ పని చేయలేదు... అంటూ ఆనాడు జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.