Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డెన్ గ్లోబ్స్ 2018, లైంగిక వేధింపులకు నిరసనగా నల్ల దుస్తులు... ఆమె మాత్రం ఎర్ర దుస్తుల్లో?

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఫంక్షన్లలో గోల్డెన్ గ్లోబ్స్ ఒకటి. 75వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఫంక్షనుకు అంతా హాలీవుడ్ ఫిలిమ్ మేకర్ హార్వే వెయిన్‌స్టిన్‌ లైంగిక వేధింపుల వ్యవహారానికి నిరసనగా అంతా నల్లటి దుస్తుల్లో వచ్చ

Advertiesment
గోల్డెన్ గ్లోబ్స్ 2018, లైంగిక వేధింపులకు నిరసనగా నల్ల దుస్తులు... ఆమె మాత్రం ఎర్ర దుస్తుల్లో?
, మంగళవారం, 9 జనవరి 2018 (11:42 IST)
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఫంక్షన్లలో గోల్డెన్ గ్లోబ్స్ ఒకటి. 75వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఫంక్షనుకు అంతా హాలీవుడ్ ఫిలిమ్ మేకర్ హార్వే వెయిన్‌స్టిన్‌ లైంగిక వేధింపుల వ్యవహారానికి నిరసనగా అంతా నల్లటి దుస్తుల్లో వచ్చారు. కానీ హాలీవుడ్ హీరోయిన్ బ్లాంకా బ్లాంకో మాత్రం అందరికీ భిన్నంగా ఎర్రటి దుస్తులు వేసుకుని వచ్చేసింది. 
 
అదేంటి... అంతా లైంగిక వేధింపులకు నిరసనగా నల్లటి దుస్తులు వేసుకుని వస్తే నువ్వు మాత్రం ఇలా ఎరుపు దుస్తుల్లో వచ్చావ్ అని ప్రశ్నిస్తే... నాకు ఎరుపు అంటే ఇష్టం. ఐ లవ్ రెడ్. కాబట్టి నేను ఎరుపు దుస్తుల్లో వచ్చాను. అలాగని లైంగిక వేధింపులకు సమర్థిస్తున్నట్లు కాదు.. నేను పూర్తిగా వ్యతిరేకిని అని చెప్పింది. కానీ అంతా ఆమె వేసుకొచ్చిన ఎరుపు దుస్తులవైపే చూస్తూ చర్చించుకున్నారు. పైగా ఎద భాగం సగానికి పైగా చూపిస్తూ ఆమె వేసుకొచ్చిన దుస్తులపై కామెంట్లు వెల్లువెత్తాయి.
 
మరోవైపు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్ హీరోయిన్లంతా ‘టైమ్స్ అప్’ పేరుతో మహోద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా 300 మంది నటీమణులు, రచయితలు, డైరెక్టర్లు ఉద్యమం చేపట్టారు. హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు... కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సైతం వేధింపులకు భయపడకుండా ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో' పాటకు స్పూఫ్.. వైరల్