Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైసెక్సువల్ అని తెలిసింది.. కెరీర్ నాశనమైంది : హాలీవుడ్ నటి

కెమెరా ముందు 31 యేళ్ళ హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ బోరున విలపించింది. ఆ మ్యాగజైన్ ప్రచురించిన ఒకే ఒక్క కథనంతో తన కెరీర్ మొత్తం సర్వనాశనమైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరి

Advertiesment
Amber Heard
, బుధవారం, 15 నవంబరు 2017 (12:51 IST)
కెమెరా ముందు 31 యేళ్ళ హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ బోరున విలపించింది. ఆ మ్యాగజైన్ ప్రచురించిన ఒకే ఒక్క కథనంతో తన కెరీర్ మొత్తం సర్వనాశనమైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా.. కొన్నివిషయాల్లో చాలా వెనుకబడివున్నామనీ, ముఖ్యంగా, వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఆమె అభిప్రాయపడింది. 
 
అంబర్ హియర్డ్ నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'జస్టిస్ లీగ్' ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ, బై సెక్సువల్ అని ఆ మేగజీన్‌లో తన గురించి ఓ కవర్ స్టోరీ రాశారనీ, దీంతో తన కెరీర్ మొత్తం నాశనమైపోయిందన్నారు. దీంతో జీవన విధానాన్ని అలాగే ఇంకా కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించారని గుర్తుచేశారు. 
 
సమాజంలో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుందన్నారు. తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్‌తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2లో తప్పులే తప్పులు.. 450 తప్పులు కనిపెట్టారు (వీడియో)