Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హలీవుడ్ వృద్ధ నటికి రూ.36 వేల డాలర్ల అపరాధం

Advertiesment
Drunk
, శుక్రవారం, 13 మే 2016 (09:29 IST)
ఫుల్‌గా తప్పతాగి నానా గొడవ చేసినందుకు హాలీవుడ్ నటికి అధికారులు 36,000 డాలర్ల జరిమానా విధించారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... 1970లలో హాలీవుడ్‌ని ఏలిన సెక్సీ తార హర్లీ మెక్ బ్రైడ్. అప్పట్లో ఆమె అందానికి అందరూ దాసోహమైపోయేవారు. అయితే ఈ మధ్య ఆమె న్యూయార్క్ నుంచి పారిస్ వెళ్ళడానికి ఏ380 ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్‌లో ఎక్కిన దగ్గరుండి మద్యం గ్యాప్ లేకుండా సేవిస్తూనే ఉంది. తాగి చిందులేయడమే కాకుండా అందరితో గొడవ చేయడం మొదలెట్టింది. 
 
బోర్డింగ్‌కు ముందే తప్ప తాగిన ఈ ఓల్డ్ బ్యూటీ పెద్దగా అరిచి అందరి మీదా పడి కాక్ పిట్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నించి, సామాన్లు విసిరేసి నానా రభస చేసింది. ఆమెను అడ్డుకోవడం ఎవరితరం కాలేకపోయింది. విసుగు చెందిన సిబ్బందులు అందరూ కలిసి ఆమెను ఓ సీట్లో బలవంతంగా కట్టేసి కూర్చొబెట్టారు. తర్వాత ఫ్లైట్‌ను మార్గమధ్యంలో న్యూఫౌండ్లాండ్ దగ్గర గ్యాండర్‌లో అత్యవసరంగా దింపి హాలీవుడ్ నటిని బయటకు పంపేశారు. 
 
పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు విమానంలో ఉన్నపుడు అతిగా ప్రవర్తించినందుకు దాదాపు 36,000 డాలర్ల జరిమానా విధించారు. ఇంత పెద్ద మొత్తంలో ఓ ప్రయాణీకురాలికి జరిమానా విధించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిడ్‌నైట్‌.. త్రిష ఏం చేసింది?