Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' కలెక్షన్ల సునామీ...

'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' కలెక్షన్ల సునామీ...
, ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (17:31 IST)
భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్ని అవెంజర్స్‌ సిరీస్‌ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రూపొందిన చిత్రమే "అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌". ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌కు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ఇది. 
 
ఈ హాలీవుడ్‌ సినిమా కోసం తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాల విడుదలను వాయిదా వేసుకొనే పరిస్థితి నెలకొంది. దీంతో సినిమాకున్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం విడుదలైన తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా హంగామా సృష్టిస్తోంది. కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో ఎక్కడా హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ చిత్రం పదర్శితమయ్యే సన్నివేశాలు థియేటర్ల వద్ద కనిపిస్తున్నాయి. "బాహుబలి : ది కంక్లూజన్" చిత్రం విడుదలైనపుడు థియేటర్ల వద్ద కనిపించిన దృశ్యాలే ఇపుడు కనిపిస్తున్నాయి. 
 
మల్టీప్లెక్స్‌ల నుంచి మాల్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా ఎక్కడ చూసినా ఈ చిత్రమే ప్రదర్శితమవుతోంది. భారత్‌లో ఈ చిత్రం హవా ఈ స్థాయిలో ఉంటే.. ఇక హాలీవుడ్‌లో  చిత్ర హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూఎస్, ఐరోపా వంటి దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చైనాలో కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ చిత్రం చైనాలో రెండు రోజులకు ముందే విడుదలైంది. 
 
గత శుక్రవారం ఈ చిత్రం విడుదలకాగా, ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ రివ్యూలతో పాటు.. మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూకడుతున్నారు. ఫలింగా టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌గా 644 మిలియన్ డాలర్ల మేరకు వచ్చినట్టు సమాచారం. తొలి వారాంతంలో ఈ కలెక్షన్లు 800 మిలియన్ డాలర్లకు పైగా... అంటే రూ.6 వేల కోట్ల దాకా వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. 
 
ఇక రెండో వారం కూడా ప్రభంజనం కొనసాగేలా ఉండటంతో ఫుల్ రన్‌లో 3 బిలియన్ డాలర్లు (రూ.20 వేల కోట్లకు పైనే) మార్కును అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో ప్రపంచ సినీ చరిత్రలోని రికార్డులన్నీ తుడిచిపెట్టుకుని పోతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌లో విషాదం.. చంద్రబోస్ ఇకలేరు...