Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సురక్షిత హోలీ ఎలా? రంగులను ఎలా చల్లుకుంటారు?

సురక్షిత హోలీ ఎలా? రంగులను ఎలా చల్లుకుంటారు?
, సోమవారం, 9 మార్చి 2020 (18:11 IST)
హోలీ సంబరాలు
అసలే కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ రోజుల్లో హోలీ పండుగను గుంపులుగుంపులుగా చేసుకోవడం మానుకుంటే మంచిదని వైద్యులు, ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హోలీ వేడుకలను ఎవరి ఇంటి వద్ద వారు జరుపుకోవడం మంచిది. ఇకపోతే రంగులు చల్లుకున్నాక వాటిని శుభ్రపరచుకోవడం ఓ సవాల్. దాన్ని ఎలా చేయాలో చూద్దాం.
 
1. దుస్తులు, తలపైపడ్డ రంగులను చేతులతో దులిపేయవచ్చు. రంగులను ఎంతమేరకు దులపగలుగుతారో అంతమేరకు దులిపేయండి. ఆ తర్వాత మెత్తటి పొడిబట్టతో రంగులను దులిపేందుకు ప్రయత్నించండి.
 
2. రంగులను మెలమెల్లగా తొలగించేందుకు ప్రయత్నించండి. వేగంగా తొలగించేందుకు ప్రయత్నిస్తే శరీర చర్మంపై మంట కలగవచ్చు. చర్మాన్ని ఎక్కువగా రుద్దితే చర్మం ఊడిపోయే ప్రమాదం ఉంది.
 
3. బేసన్ లేదా మైదా పిండిలో నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని రంగులపై పూయండి. వీలైతే కొబ్బరి నూనె లేక పెరుగుతో శరీర చర్మంపైనున్న రంగులపై పూయండి. దీంతో రంగులు తొలగించబడుతాయి.
webdunia
4. రంగులను తొలగించేందుకు కిరోసిన్, రసాయనాలతో కూడుకున్న డిటర్జెంట్ లేదా బట్టలుతికే సబ్బును వాడకండి. ఇవి చర్మానికి హాని కలుగచేస్తాయి.
 
5. వెంట్రుకలకు అంటుకున్న రంగులను తొలగించేందుకు వెంట్రుకలను బాగా దులపండి. పొడి రంగులు అంటుకుని వుంటే అవి తొలగిపోతాయి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో మీ తల వెంట్రుకలను కడిగేయండి. బేసన్ లేదా పెరుగుతో కలుపుకున్న నెల్లికాయ(ఉసిరికాయ)రసంతోను తలను కడిగేందుకు ఉపయోగించవచ్చు. ఉసిరికాయను ఒకరోజు ముందే నానబెట్టండి. ఆ తర్వాత షాంపూను తలకు దట్టించి స్నానం చేయండి.
 
6. అనుకోకుండా కళ్ళల్లో రంగులు పడిపోతే వెంటనే చల్లటి నీటితో కళ్ళను కడగండి. కళ్ళల్లో మంట తగ్గకపోతే ఓ పెద్ద గిన్నె నిండుగా నీళ్ళు తీసుకోండి. అందులో మీ కళ్ళనుంచి కనురెప్పలను తెరిచి కనుగుడ్లను అటూ-ఇటూ పదేపదే తిప్పండి. కాసేపైన తర్వాత రోజ్ వాటర్‌ కొన్ని చుక్కలు వేయండి. కాసేపటి వరకు కళ్ళను మూసి వుంచండి. వీలైతే కళ్ళపైన కింద చందనపు పేస్టును పూయండి. ఎండిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. కాసింత ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు కంటి చుక్కల (ఐ డ్రాప్స్) మందును కళ్ళలో వేయవచ్చు.
 
7. రంగులను తొలగించుకున్న తర్వాత చర్మం పొడిబారుతుంది. చర్మం అక్కడక్కడ మంటపుడుతుంటుంది. చర్మం పూర్వపు స్థితికి చేరుకోవాలంటే చర్మంపై మాయిశ్చరైజర్, చేతులు, కాళ్ళకు బాడీ లోషన్‌ను పూయండి.
 
8. వీలైతే హోలీ సంబరాలు పూర్తయిన తర్వాత మీరు ఫేషియల్, మేనీక్యూర్, పెడిక్యూర్ తదితర చికిత్సలు తీసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీ పండుగ, ఎలాంటి రంగులు వాడుతున్నారు?