Article Hindu Religion %e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 %e0%b0%ad%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c %e0%b0%89%e0%b0%b5%e0%b0%be%e0%b0%9a 107052400014_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ భగవాన్‌ ఉవాచ

Advertiesment
శ్రీకృష్ణు భగవత్‌ స్వరూపుడు గీత కౌరవ అర్జునుడి
కుత స్తా్వ కశ్మల మిదం విషమే సముపస్థితం
అనార్య జుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున

అనువాదం : ప్రియమైన అర్జున. ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి. జీవితపు విలువ తెలియని వారు మాత్రమే చేసే ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ మనిషిని ఉన్నత మార్గం వైపు పోనివ్వవు. ఇలాంటి ఆలోచనలు అపకీర్తిని కూడా కలిగిస్తాయి.

వ్యాఖ్యానం : శ్రీకృష్ణుడే భగవత్‌ స్వరూపుడు అని గీత ప్రబోధిస్తున్నది. భగవద్గీతలో అర్జున ఉవాచ , అని భగవాన్‌ ఉవాచ అన్నారు గానీ శ్రీకృష్ణ ఉవాచ అనలేదు. కృష్ణుడు కూడా తానే భగవత్‌ స్వరూపం అంటూ, సర్వ కర్మలు తనలోనే లీనమతువున్నాయని, వాటికి హేతువు కూడా తానే అంటూ గీతా సందేశాన్ని అందించాడు. కౌరవ సైన్యాన్ని చూసి అర్జునుడంతటి పరాక్రమ వంతుడు యుక్తాయుక్త విచక్షణతో, బంధుమిత్రలపై మమకారంతో యుద్ధం చేయాల్సింది పోయి వైరాగ్యస్థితికి చేరుకున్నాడు. అతడి విషాదాన్ని చూసి కృష్ణుడే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు - కుతః - ఎక్కడి నుండి - నీకీ ఆలోచనలు వస్తున్నాయంటూ ప్రారంభించాడు.

అనార్య జుష్టమ్‌ - అనే ప్రయోగాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చేశాడు. అంటే ఆర్యులు కాని వారు చేసే పని - అర్జునుడి చేస్తున్నాడని. ఆర్యులు అంటే దివ్యజ్ఞానులని, జీవితం విలువ తెలిసిన ఉన్నతులని ఇక్కడి ఉద్దేశం.

అర్జునుడు క్షత్రియుడు. యుద్ధంలో అతడి విద్యుక్త ధర్మాన్ని అతడు ఆచరించాల్సిన తరుణం అది. కానీ అందుకు అతడు విముఖత వ్యక్తం చేస్తున్నాడు. భౌతికమైన బంధాలలో చిక్కుకుని చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు కనుకనే అర్జునుడు అనార్యుడిగా ఆలోచిస్తున్నాడని కృష్ణుడు సంబోధించాడు. కులధర్మం పాటించడం అనేది మనిషికి ఎంతో విలువైనది, ముఖ్యమైనదిగా భావించే కాలం అది. దానిని ఏ కారణం చేత తప్పినా అపకీర్తి అని, జీవితంలో ఉన్నతిని పొందలేరని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. తన బంధుమిత్రాదులపై అర్జునుడు చూపే కనికరం భగవత్‌ స్వరూపుడైన శ్రీకృష్ణుడు అంగీకరించకపోవడం ఇక్కడి విశేషం.

అనవసర విషయాల గురించి ఆలోచించి చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరించడం క్షమార్హం కాదు.

కై్ల బ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ ముపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో్వత్తిష్ఠ పరంతప

అనువాదం : ఓ పృథాకుమారా! విషాదం, అపౌరుషత్వం నీకు తగనిది. క్షుద్రమైన మనో దౌర్బల్యాన్ని వీడి శత్రువులను జయించేందుకు ఉద్యుక్తుడివి కావాలి.

వ్యాఖ్యానం : ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రథాకుమారా అని సంబోధించడంలో ఒక విశేషం వుంది. కృష్ణుడి తండ్రి వసుదేవుని చెల్లెలు పేరు పృథ. ఆమెకు అర్జునుడు వరుసకు కుమారుడు అవుతాడు. అంటే తనకు, అర్జునుడికి వున్న రక్తసంబంధాన్ని కృష్ణుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు.

భీష్మ, ద్రోణాది ఆచార్యులు, బంధుమిత్రులపై మమకారంతో, అర్జునుడు తాను ఔదార్యంతో వున్నట్లు భావించి వారిని తానెలా చంపగలనని మథనపడుతున్నాడు. అవరసరమైన చోట కాక అనవసరమైన చోట ఔదార్యం, అహింసా తత్తా్వన్ని ప్రదర్శించడం బుద్ధి వున్న వాళ్ల లక్షణం కాదని బోధిస్తున్నాడు కృష్ణుడు. అర్జునుడి ఔదార్యాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు క్షుద్రమైన మనో దౌర్బల్యం (క్షుద్రం హృదయదౌర్బల్యం)గా అభివర్ణించాడు. అతడిని యుద్ధానికి ఉద్యుక్తుడిని చేసే ఉద్దేశంతో ఉత్తిష్ఠ పరంతప అన్నాడు. అంటే శత్రువులను జయించువాడా, లెము్మ అని అర్థం.

శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడి రథ సారథి మాత్రమే కాదు. అతడికి బంధువు, స్నేహితుడు కూడా. అర్జునుడు తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోవడం లేదు. తాను ఎవరికైతే సారథ్యం వహిస్తున్నాడో, అతడికి ఆపద సమయం వచ్చినప్పుడు అతడికి సరైన మార్గాన్ని కూడా చూపే బాధ్యతను శ్రీకృష్ణుడు స్వీకరించాడు. ఒకడికి ఏదైనా ఆచరించమని చెబుతున్నప్పుడు ముందు ఆ చెప్పే వాడు ఆచరించడం ఉన్నత వ్యక్తుల లక్షణం. రథ సారిథిగా తన కర్తవ్యాన్ని పాటిస్తూ అర్జునుడిని విచారాన్ని వదిలి లెమ్మని ప్రోత్సహించడంలో శ్రీకృష్ణుడిచ్చే సందేశం అదే.

Share this Story:

Follow Webdunia telugu