Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవద్గీత పారాయణం వల్ల కలిగే ఫలితాలేమిటి...?

భగవద్గీత చదవడం వల్ల ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సర్వ పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని చెపుతారు. అర్జున విషాదయోగం చదవడం వల్ల మానవుడికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. సౌంఖ్య యోగం వల్ల ఆత్మస్వరూపం కనబడు

భగవద్గీత పారాయణం వల్ల కలిగే ఫలితాలేమిటి...?
, గురువారం, 2 జూన్ 2016 (21:58 IST)
భగవద్గీత చదవడం వల్ల ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సర్వ పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని చెపుతారు. అర్జున విషాదయోగం చదవడం వల్ల మానవుడికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. సౌంఖ్య యోగం వల్ల ఆత్మస్వరూపం కనబడుతుంది. కర్మయోగాన్ని చదివితే ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిస్తుంది. జ్ఞానయోగం, కర్మసన్న్యాసయోగం చదివితే చెట్లు, పశువులు, పక్షులు కూడా వాటికి పాపం నశిస్తుంది. ఆత్మనంయమయోగం పారాయణం చేస్తే సమస్త దానాల ఫలితం కలుగుతుంది. విజ్ఞానయోగంతో జన్మరాహిత్యం కలుగుతుంది. 
 
అక్షరపరబ్రహ్మయోగం వల్ల స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగుతాయి. రాజవిద్యా రాజగుహ్యయోగంతో ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారి నుంచి సంక్రమించే పాపం నశిస్తుంది. ఇంకా విభూతియోగంతో ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. విశ్వరూప దర్శన యోగాన్ని చదివితే చనిపోయినవారు కూడా తిరిగి జీవిస్తారని చెప్పబడింది. 
 
భక్తియోగం పారాయణం వల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయినవారు కూడా బ్రతుకుతారని చెప్పబడింది. క్షేత్రక్షేత్ర విభాగయోగం చదవడంతో చండాలత్వం నశిస్తుంది. గణత్రయ విభాగయోగంతో స్త్రీహత్యా పాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి. పురుషోత్తమ ప్రాప్తియోగంతో ఆహారశుద్ధి కలిగి మోక్షం సిద్ధిస్తుంది. శ్రద్ధాత్రయవిభాగయోగంతో ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి. మోక్షసన్న్యాసయోగంతో సమస్త యజ్ఞాచరణఫలం కలిగి ఉద్యోగం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో సర్వం దొరుకుతాయ్.. మద్యం నుంచి బార్ గర్ల్స్ వరకు...