Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుధవారం మాంసాహారం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఏ వారాల్లో నాన్ వెజ్ తినాలి?!

ఆదివారం సెలవు దొరికింది కదాని.. బాగా మాంసాహారం లాగించేవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోమ, మంగళవారాలు వదిలి.. బుధవారం నాన్ వెజ్ లాగించి.. తిరిగి గురు, శుక్ర, శనివారాలు బ్రేకిచ్చేవారూ ఉన్నారు. కొందరు మంగ

బుధవారం మాంసాహారం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఏ వారాల్లో నాన్ వెజ్ తినాలి?!
, సోమవారం, 25 జులై 2016 (16:45 IST)
దేవానుగ్రహం పొందాలంటే.. ఎప్పుడంటే అప్పుడు పూజలు చేయకూడదు. వారాలు, శుభదినాల్లో, శుభ ఘడియల్లో పూజ చేయాలి. లేదా ప్రతి నిమిషం మనస్సులో దైవాన్ని స్మరించుకుంటే సరిపోతుంది. అంతేకానీ అశుభ ఘడియల్లో పూజ చేయడం, వేళ కానీ వేళలో పూజలు చేయడం కూడదు. ఇక ఏయే వారాల్లో ఏయే దైవాన్ని పూజించాలో తెలుసుకుని.. దాని ప్రకారం పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
* ఆదివారం సూర్యదేవునిని పూజించాలి. 
* సోమవారం శివాలయానికి వెళ్ళాలి. ఈశ్వరుడిని పూజించాలి
* మంగళవారాల్లో కుమార స్వామిని 
* బుధవారం శ్రీ కృష్ణుడిని, వేంకటేశ్వరుడు ఇలా విష్ణు మూర్తి అవతార మూర్తులను పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. 
* గురువారం - నవగ్రహాలు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను కొలువవచ్చు 
* శుక్రవారం - అమ్మవారిని పూజించడం ఉత్తమం. 
* శనివారాల్లో - విష్ణుమూర్తిని, నవగ్రహాలు, ఆంజనేయుడిని పూజించడం చేయాలి.
 
ఇక ఆదివారం సెలవు దొరికింది కదాని.. బాగా మాంసాహారం లాగించేవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోమ, మంగళవారాలు వదిలి.. బుధవారం నాన్ వెజ్ లాగించి.. తిరిగి గురు, శుక్ర, శనివారాలు బ్రేకిచ్చేవారూ ఉన్నారు. కొందరు మంగళ, శుక్రవారాలు మాంసాహారం ముట్టుకోరు. కొందరు గురు, శుక్ర, శనివారాలు ముట్టుకోరు. అయితే బుధవారం విష్ణువుకు ప్రీతికరమైన రోజు కావున ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవడం కాస్త తగ్గించుకోవడం మంచిది. 
 
అలవాటు పడిన వారు మెల్ల మెల్లగా ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం మాసానికి రెండు సార్లు తీసుకోవడం ఉత్తమం. అంతేకానీ వారానికి రెండు లేదా మూడు సార్లు నాన్ వెజ్ లాగించడం ఆధ్యాత్మికంగానే గాకుండా సైన్స్ పరంగానూ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. 
 
శరీరానికి విటమిన్ బీ 12, ఐరన్ వంటి పోషకాల కోసం మాంసాహారం తీసుకోమని వైద్యులు చెప్తారు. కానీ మానవ దేహంలోనూ మృగం అనే జంతువు దాగివుంటుందని.. అలాంటి మనిషి జంతువులను వధించి.. వాటి మాంసాన్ని అతిగా తీసుకుంటే.. కిడ్నీ సమస్యలు, కోలన్ క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి రోగాలు కొనితెచ్చుకుంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల వెంకన్నకు వేలకోట్లు కుమ్మరించింది ఒకే ఒక్కడు... ఎవరతను?