Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోమాలు ఎక్కడ చేయాలో తెలుసా? ఫలితాలు ఏమిటి?

హోమాలు చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఈ హోమాలు అనేక రకాలున్నాయి. అందులో ఒక్కొక్కదానికి ప్రత్యేక ఫలితం ఉంటుంది. సాధారణంగా హోమాలను పంట పొలాల్లో నిర్వహించాలి. పూర్వకాలంలో పంట పొల్లాలోనే హోమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా చెరకు,

హోమాలు ఎక్కడ చేయాలో తెలుసా? ఫలితాలు ఏమిటి?
, బుధవారం, 24 మే 2017 (17:08 IST)
హోమాలు చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఈ హోమాలు అనేక రకాలున్నాయి. అందులో ఒక్కొక్కదానికి ప్రత్యేక ఫలితం ఉంటుంది. సాధారణంగా హోమాలను పంట పొలాల్లో నిర్వహించాలి. పూర్వకాలంలో పంట పొల్లాలోనే హోమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా చెరకు, అరటి తోటలను పండించే పంట పొలాల్లోనే నిర్వహించాలి. పంట పొలాలను ఆవులతో మేత మేయించాక శుభ్రపరిచి హోమం చేయడం ఆనవాయితీ.  
 
అయితే ప్రస్తుతం హోమాలు సైతం హైటెక్ తరహాలో జరుగుతున్నాయి. సిమెంట్ లేదా టైల్స్ నేలల్లో, ఇంటి నిర్మాణం కోసం చేపట్టే ఇసుకపై ఇటుకలను పేర్చి హోమాలు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా చేసే హోమానికి తగిన ఫలితం లభించదని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం హోమాలు నిర్వహించేందుకు వస్తున్న పండితులు చేతుల్లో సెలఫోన్లతో వస్తున్నారు. హోమం జరుగుతుండగానే సెల్‌ఫోన్ మోగితే మాట్లాడుతూ.. మంత్రాలు జపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. హోమం చేస్తున్నప్పడు కొన్ని మంత్ర పదాలను ఉచ్చరించే సమయంలో దృష్టంతా దానిపైనే ఉండాలి. అలా చేసే హోమంపై పూర్తి దృష్టిని సారిస్తేనే ప్రతిఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. 
 
కానీ ప్రస్తుతం పద్ధతి ప్రకారం హోమాలు నిర్వహించే పండితులు తక్కువేనని చెప్పాలి. కానీ కొన్ని సుప్రసిద్ధ ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా హోమాలు నిర్వహించే పండిత కుటుంబాలు నివసిస్తూనే ఉన్నారు. ఈ పురోహితులు ఆహార నియమాలు పాటించడం, వేదాలను పఠించిన వారుగా ఉంటారు. ఎండైనా, వానైనా విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇలాంటి వారు హోమం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి. 
 
ఆరు రకాల యజ్ఞాలు
1. ద్రవ్యయజ్ఞం- ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి.
 
2. తాపయజ్ఞం- జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం. 
 
3. స్వాధ్యాయయజ్ఞం - ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాకుండా, అర్థం చేసుకుని లోక కల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం.
 
4. యోగయజ్ఞం- యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం. 
 
5. జ్ఞానయజ్ఞం- మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? అని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం.
 
6. సంశితయజ్ఞం-తనలోని కామక్రోధ మద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని పడితే మామూలుగా వదలడు... ఎన్నేళ్లు పట్టుకుంటాడో తెలుసా?