Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శని పడితే మామూలుగా వదలడు... ఎన్నేళ్లు పట్టుకుంటాడో తెలుసా?

ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు కూడా అని కూడా అంటారు. నాడు అంటే అర్థభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రార

Advertiesment
శని పడితే మామూలుగా వదలడు... ఎన్నేళ్లు పట్టుకుంటాడో తెలుసా?
, మంగళవారం, 23 మే 2017 (22:00 IST)
ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు కూడా అని కూడా అంటారు. నాడు అంటే అర్థభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం. శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి. 
 
ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం ఒకవేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అధమస్థానానికి వెళ్లిపోవడం... తదితరాలు జరుగుతాయి. శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చు ఏర్పడుతుంది. 
 
అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. శని ప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్లు అనేక మార్గాలు సూచించారు. విష్ణు సహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్య హృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సివుంటుంది. దీంతో పాటు తీర్థయాత్రలు, వ్రతాలు చేయాలి. 
 
ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవగ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్ల చీమలకు చక్కెర వేయడం లాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా మనపై శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. అన్నింటికన్నా మనస్సును స్థిరంగా, పవిత్రంగా వుంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో వుంటే ఏ గ్రహ ప్రభావం మనపై పడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి తిరుమల కొండలపై వెలసిన కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటే?